ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు. కాగా.. దీనిపై నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. అందులో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క స్థానం కోల్పోయాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరుకోగా.. యశస్వి ఒక్క స్థానం సాధించి ఏడో స్థానానికి చేరుకున్నాడు.