కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై 23 ఏళ్ల మహిళా టీచర్ కిడ్నాప్‌కు గురైంది. గురువారం ఉదయం ఆమె పాఠశాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లికి నిరాకరించిందని ఆమె బంధువే కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం.. కర్నాటక రాష్ట్రం హాసన్ జిల్లా…