రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో మంత్రి అయ్యాను.. కానీ, నువ్వు మొదటిసారి పోటీ చేసి ఓడిపోయావు.. మీ తాత.. మీ నాన్న ముఖ్యమంత్రి కాకపోతే వార్డు కౌన్సిలర్ కూడా గెలవలేవు అంటూ నారా లోకేష్ పై సెటైర్లు వేశారు మాజీ మంత్రి అనిల్ ..
అనంతపురం జిల్లాలో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర సాక్షిగా టీడీపీలో విభేధాలు రచ్చకెక్కుతున్నాయి. పెనుకొండలో తెలుగు తమ్ముళ్లు ఒకరిని ఒకరు కొట్టుకోగా, మడకశిర ఏకంగా యాత్రనే వాయిదా వేయించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమాపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. 'అన్నీ ఉన్నమ్మ అణిగి మణిగి ఉంటే ఏమి లేనమ్మ ఎగిరెగిరి పడుతోంది' అన్నట్లుగా దేవినేని ఉమా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కులం అంశంపై నే చేస్తున్నారని స్పష్టం అవుతుందని ఆరోపించారు సజ్జల.. ముద్రగడ పద్మనాభం తన కులం కోసం గట్టిగా నిలబడిన వ్యక్తి.. ఆ కృషిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. ముద్రగడ నిజాయితీ గల వ్యక్తి.. మా పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అన్నారు.