ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వారాహి యాత్ర 5వ దశ నిర్వహణ, జనసేన - తెలుగుదేశం సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశ నిర్వహణ అంశాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు.
సోమవారం నుంచి శనివారం వరకు రోజుకి రెండు లీగల్ ములఖాత్‌లు ఇస్తూ వచ్చారు జైలు అధికారులు.. ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయంతో.. చంద్రబాబు లీగల్ ములాఖత్‌ల సంఖ్య ఒకటికి పడిపోయింది..
Kasani Gnaneshwar React on TDP Contesting In Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని తాను కలిశానని, తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి వివరించానని కాసాని తెలిపారు. మంగళవారం చంద్రబాబు బయటకు వస్తారని తాము ఆశిస్తున్నామన్నారు.…
Iam With CBN Placards Display in India vs Pakistan Match: స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నారు. ‘బాబుతో నేను’ అంటూ వేలాది మంది బెంగళూరు ప్రజలు మాజీ సీఎం చంద్రబాబుకు అండగా…
విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద 'న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లు'.. నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.