కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. ప్రజలా? కుటుంబమా అన్న ప్రశ్న వస్తే మా ముఖ్యమంత్రి ఛాయిస్ ప్రజలేనని తెలిపారు. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్ళీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు? అని సజ్జల ప్రశ్నించారు. వివేకానందా రెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.. ఫలితం ఏమయ్యిందని అన్నారు. కాగా.. జగన్…
లోక సభ స్పీకర్ అనుమతి కోరాను.. స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని వెల్లించారు. ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు కేశినేని నాని.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.. త్వరలోనే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు.. తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. త్వరలో లోక్ సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని కేశినేని ట్వీట్ చేశారు.. నా అవసరం లేదని చంద్రబాబు భావించారు. ఇంకా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని తన ట్వీట్లో రాసుకొచ్చారు.
ఫేస్ బుక్ పోస్ట్ లో అన్ని వివరాలు సవివరంగా పెట్టా.. అంతకు మించి కొత్తగా చెప్పేదేమీ లేదన్న ఎంపీ కేశినేనా నాని.. రాముడికి ఆంజనేయ భక్తి తరహాలోనే అధినేత ఆదేశాలు శిరసా వహిస్తా అని స్పష్టంగా ఫేస్ బుక్ లో పెట్టా.. కానీ, మీడియాకు కావాల్సింది మసాలెనేగా.. తినబోతూ రుచులెందుకు..? అన్ని విషయాలు ఒకే రోజెందుకు? అని ప్రశ్నించారు.
ఉమ్మడి మ్యానిఫెస్టోలో పలు అంశాలు పరిశీలించాలంటూ పవన్ కల్యాణ్‌కు సూచించారు హరిరామ జోగయ్య.. సీఎం వైఎస్ జగన్‌ను ఓడించాలంటే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకంటే మెరుగైన పథకాలు అమలు చేయాలన్నారు.
తిరువూరులో ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య ఘర్షణ రచ్చగా మారింది.. దీంతో, చర్యలకు పూనుకుంది టీడీపీ.. ఎంపీ కేశినేని నానికి క్లారిటీ ఇచ్చేసింది.. బెజవాడ ఎంపీ టిక్కెట్టను వేరే వారికి కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు ఎంపీ కేశినేని నాని. మొత్తంగా తిరువూరు ఘటన తర్వాత క్లారిటీ ఇచ్చేసింది టీడీపీ అధిష్టానం.