వైసీపీకి, మంత్రి పదవికి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరుతున్నానని తెలిపారు.
ప్రస్తుతం జరుగు (2024) సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో.. చేనేత వర్గాలైన కుర్నీ (నేసే), పద్మశాలిల పూర్తి మద్దతు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప ముని మనవడు మాచాని సోమనాథ్కు ఉంటుందని ఎమ్మిగనూరు చేనేతల ఐక్యవేదిక నాయకులు తెలిపారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి. టీడీపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో ఇవాళ జయహో బీసీ సభ జరగనుంది.
టీడీపీ-జనసేన కలయిక ఒక పాశుపతాస్త్రమని.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ 'రా కదలి రా' బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపైనే దృష్టి పెట్టామన్నారు. 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ను పూర్తి చేసి కియా పరిశ్రమను తీసుకొచ్చామని.. ఇప్పుడు ఎకరా 2 కోట్లు ఉంది, మనం ఉంటే ఎకరా 5 కోట్లు అయ్యేదని ఆయన అన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రేపు మంగళగిరిలో టీడీపీ 'జయహో బీసీ' బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభలో టీడీపీ- జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది.
2 దశాబ్దాలుగా బనగానపల్లె నియోజకవర్గం ప్రజల సేవకు టీడీపీ అంకితమైన కుటుంబం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబం. గతంలో బీసీ జనార్థన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి సర్పంచ్గా బనగానపల్లె పట్టణ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించారు. వ్యాపార వేత్తంగా పేరుగాంచిన బీసీ జనార్థన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే కరువు ప్రాంతమైన బనగానపల్లెలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టి పేదలను ఆదుకున్నారు. 2014 లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన తొలిసారే సిట్టింగ్…