డబ్బు, పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు.. గుంటూరు ప్రజలకు సేవ చేసేందుకే వచ్చా.. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాం.. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించి లోకేష్ ను, నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి అని పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
ఎలక్షన్ టైంలో ఏ రాజకీయ పార్టీ అయినా వలసలకు సై అనడం, గేట్లు తెరిచి జై కొట్టడం కామన్. బలం, బలగం పెరుగుతుందన్న కోణంలో రా… రమ్మని పిలవడం కూడా సహజం. అయితే… ఆ విషయంలో చిత్తూరు తమ్ముళ్ళు మాత్రం కాస్త తేడాగా ఉన్నారట. టీడీపీలోకి వస్తామని పది మంది అడిగితే… అందులో అతి ముఖ్యమైన ఇద్దరు ముగ్గురికి కండువాలు కప్పేసి మిగతా వారిని మాత్రం ఇప్పుడు మీరున్న పార్టీలోనే ఉండండి… కాకుంటే… పని మాత్రం మాకు…
నంద్యాల జిల్లా బనగానపల్లె రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల రేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన బీసీ జనార్థన్ రెడ్డి ఈసారి ఎలాగైనా బనగానపల్లెలో టీడీపీ జెండా ఎగురవేయాలని పట్టుదలగా ఉన్నారు.