కృష్ణా జిల్లాలో కాక రేపుతున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.. మైలవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్లా తెలుగుదేశం పార్టీ సర్వేలు చేపట్టింది.. రెండు చోట్లా టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లతో సర్వే నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఓవైపు మంత్రులు, వైసీపీ నేతలు.. మరోవైపు విపక్షాలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి జోగి రమేష్.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎదుర్కొవడానికి చంద్రబాబుకి దమ్ములేదన్నారు.. ఇక, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు 86 నియోజకవర్గాల్లో అసలు తెలుగుదేశం…