నలుగురు ఎమ్మెల్యేలు.. 14 మంది ఇంఛార్జులు. వీరిలో కొందరు కనిపించరు.. మరికొందరు టచ్‌మీ నాట్‌గా ఉంటారు. గాలి తగ్గి సైకిల్ పంక్చరయ్యే పరిస్థితులు ఉన్నా పట్టించుకోవడం లేదట. అందరూ గాలి కోసం ఎదురు చూస్తున్నారే తప్ప.. సైకిల్‌కి గాలికొట్టే ప్రయత్నాలే లేవట. ఆ జిల్లా ఏంటో.. అక్కడ నాయకులు ఎందుకలా ఉన్నారో ఈ స్టోరీలో చూద్దాం. ఎమ్మెల్యేలు.. ఇంఛార్జులు టీడీపీని పట్టించుకోవడం లేదట..! తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ జోరు తగ్గిందా? వరస ఓటములు తమ్ముళ్లను నిరుత్సాహ…