Off The Record: నందమూరి కుటుంబానికి, టీడీపీకి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అట్నుంచి వచ్చే ఆశీస్సులు, ఆదేశాల కోసం అర్రులు చాచే తెలుగుదేశం నాయకులకు కొదవే లేదు. కానీ… మారుతున్న పరిస్థితులు, సమీకరణల దృష్ట్యా లెక్కలు మారిపోతున్నట్టే కనిపిస్తోంది. ఆ మార్పు ఇన్నాళ్ళు జూనియర్ ఎన్టీఆర్‌కే పరిమితం కాగా… ఇప్పుడు ఆయన సోదరుడు కళ్యాణ్‌రామ్ వంతొచ్చినట్టు కనిపిస్తోంది. తాజాగా కాకినాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు కళ్యాణ్‌రామ్. పైగా… రెండు రోజులపాటు…