ఏపీలో టీడీపీ ఇంఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలకు టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. మొత్తం 12 మందిని శుక్రవారం జరిగే సమావేశానికి రావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. ఈ జాబితాలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో గంటా క్రియాశీలకంగా లేరు. అయితే ఓ సారి బీజేపీలో చేరుతారని.. మరోసారి వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని అటు ఖండించలేక.. ఇటు అంగీకరించలేక గంటా సైలెంట్‌గానే ఉన్నారు. మధ్యలో…