ప్రత్తిపాడులో టీడీపీకి ఇంఛార్జ్ కరువు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఐదు ఎన్నికల్లో టీడీపీ నుంచి మాకినేని పెదరత్తయ్య గెలిచారు. 2009లో ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్‌గా మారింది. ప్రస్తుతం ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన మేకతోటి సుచరిత ఉన్నారు. టీడీపీ ఓడినా ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. నియోజకవర్గంలోని కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో తమ్ముళ్లదే హవా. ప్రత్తిపాడు మండలంలో వైసీపీ నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది.…