ఏపీలో ఇంకా ఎన్నికలకు టైం వున్నా.. అధికార. విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. యాభై వేల మంది వచ్చిన మహానాడు ప్రజా విజయం కాదు. మా పార్టీ మంత్రులు బస్సు యాత్రకు వెళ్తే లక్షల మంది జనం వస్తున్నారన్నారు. మీకు నిజంగా ప్రజా బలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి.…
ఏపీలో జగన్ పాలనపై మహానాడు వేదికగా టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మహానాడు 2022లో భాగంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సమావేశంలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసంపై తీర్మానం ప్రవేశపెట్టారు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి. సీఎం జగనుపై సీరియస్ కామెంట్లు చేశారు సోమిరెడ్డి. వ్యవస్థలపై సీఎం జగనుకు నమ్మకం లేదు. పరిపాలనా వ్యవస్థను జగన్ భ్రష్టుపట్టించారు…. తన తండ్రి హయాంలో జగన్ చేసిన అవినీతికి ఐఏఎస్సులు జైళ్ల పాలయ్యారు. సీఎం హోదాలో ఉన్న జగన్ మాటను…
ఏపీలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అందునా శ్రీకాకుళం జిల్లాలో బంధువుల మధ్యే రాజకీయ వైరం ముదురుతోంది. టీడీపీ నేత కూనరవి- స్పీకర్ తమ్మినేని మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. టీడీపీపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కూన రవి. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకం తమ్మినేని. తమ్మినేనిని ఆముదాల వలసలో సజీవంగా దహనం చేస్తారు. తమ్మినేని పాడె మోయడానికి కూడా ఎవరు ఉండరని ఘాటైన…
మహానాడు నిర్వహణకు సిద్ధం అయ్యింది తెలుగుదేశం పార్టీ.. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడు జరగనుంది.. అయితే, మహానాడు సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభ కోసం జనసమీకరణ చేయడకుండా ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. రవాణా శాఖ అధికారులను అడ్డుపెట్టుకొని ఎవరూ వాహనాలు ఇవ్వొద్దని ఒత్తిడి తెస్తున్నారని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించిన విషయం తెలిసిందే.. అయితే, మహానాడు తెలుగుజాతి పండుగ.. మహానాడుకు తరలివెళ్తాం.. అవసరమైతే నడిచి వస్తామని ప్రకటించారు…