ఇంఛార్జ్‌ల విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి ప్లస్సా.. మైనస్సా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? పొరపాట్లకు ఎక్కడ ఆస్కారం ఇస్తున్నారు? తమ్ముళ్ల పడుతున్న ఇబ్బందులేంటి? క్షేత్రస్థాయి నుంచి సరైన ఫీడ్ బ్యాక్ లేదా? ఏపీలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ.. సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంఛార్జులు లేరు. వీలైనంత త్వరగా అక్కడ ఇంఛార్జులను నియమించే పనిలో స్పీడ్ పెంచారు చంద్రబాబు. కొన్ని నియోజకవర్గాల విషయంలో ఇబ్బందులు లేకపోయినా.. మరికొన్ని చోట్ల మాత్రం పార్టీలో…
నేటి ఇంఛార్జ్‌లే రేపటి అభ్యర్థులు. ఏపీ టీడీపీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. పార్టీ కూడా గట్టి నిర్ణయానికే వచ్చేసిందట. నాయకులను ఒప్పించే బాధ్యతలను పెద్దలే తీసుకున్నట్టు టాక్. అదేలాగో..ఎందుకో ఇప్పుడు చూద్దాం. నియోజకవర్గ ఇంఛార్జ్‌ల నియామకంపై టీడీపీ ఫోకస్! 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ టీడీపీలో ముఖ్యనేతలు చాలా మంది కాడి పడేశారు. అప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు సైతం నియోజకవర్గాలను వదిలి వెళ్లిపోయారు. సొంత వ్యాపారాల్లో కొందరు.. మౌనంగా మరికొందరు ఉండిపోయారు.…