కుప్పంలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. కుప్పం మున్సిపల్ ఎన్నికల నగారా మోగిననాటి నుంచి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు సవాల్లు ప్రతి సవాల్లు చేసుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాతా కుప్పం 14వ వార్డుకు కౌన్సిలర్ నామినేషన్ వేసిన టీడీపీ రెండో అభ్యర్థి ప్రకాష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అదృశ్యమయ్యారు. ఇదే వార్డుకు వెంకటేష్ అనే వ్యక్తి కూడా టీడీపీ తరుపున నామినేషన్ వేశారు. కానీ స్రూటినీలో వెంకటేశ్ నామినేషన్ సక్రమంగా లేనందువలన తొలగించబడింది.…