ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అయితే ఇటీవల ఏపీలో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ఏపీ ప్రభుత్వంలో చలనం లేదంటూ ఆరోపించారు. ప్రజల ప్రాణాలకంటే కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. వ్యాక్సినేషన్‌లో ఏపీ వెనకబడిందని, ఇతర…
బీసీల విషయంలో జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో బీసీలకు అడుగడుగునా వంచన జరిగిందని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ల కోతతో 16,800 మందికి పదవులు దూరమయ్యాయని గుర్తుచేశారు. బీసీ జనగణన కోరుతూ 2014లోనే తెలుగుదేశం తీర్మానం చేసిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఢిల్లీ చుట్టూ కేసుల కోసం తిరగడం తప్ప.. బీసీ గణనపై కేంద్రంపై ఎప్పుడైనా జగన్ ప్రభుత్వం ఒత్తిడి చేసిందా అని నిలదీశారు.…
టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటూ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. అసలు ఏం జరిగింది అనేదానిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు… తనపై చర్యలు తీసుకోవాలన్న ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో వాస్తవాలను వివరిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు.. మద్యం షాపుల సంఖ్య విషయంలో తానెక్కడా అవాస్తవాలు మాట్లాడలేదని లేఖలో స్పష్టం చేసిన అచ్చెన్న.. తనపై చీఫ్ విప్ శ్రీకాంత్…