AICC ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి చింతన్ శిబిర్ తర్వాత.. తెలంగాణలోనూ కాంగ్రెస్ చింతన్ శిబిర్ సమావేశాలను ఘనంగా ముగించారు రాష్ట్ర పార్టీ నాయకులు. కాకపోతే ఈ చింతన్ శిబిర్‌తో పార్టీ ఏం చెప్పాలని అనుకుంది? ఏం చెప్పింది అనేది పార్టీ కేడర్‌కు కూడా అంతుచిక్కడం లేదట. ఆ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులంతా ఓపెన్ అయ్యారు. వాటిలో పార్టీ తీసుకున్న నిర్ణయాలేంటన్నదే స్పష్టత కరువైనట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది. అమలు చేయాల్సిన నిర్ణయాలేంటో కూడా శ్రేణులకు అర్ధం కాలేదని…