తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్, బీజేపీ, టి.కాంగ్రెస్ వరుస కార్యక్రమాలతో హాట్ హాట్ గా సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ భారీ సభకు ప్లాన్ చేస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఢిల్లీ దూతలు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు.
తెలంగాణ ఇచ్చి కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడం కాంగ్రెస్ కు వెలితిగా ఉంది. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో.. మూడోసారి ఎలాగైనా పవర్లోకి రావాలని పట్టుదలగా ఉంది. అయితే సంస్థాగత లోపాలు పార్టీని వెంటాడుతున్నాయి. నేతల మధ్య అనైక్యత కూడా శాపంగా మారింది. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలనలోనూ నేతలు తలోదారిగా ప్రవర్తిస్తుండటంతో.. శ్రేణులకు మింగుడుపడటం లేదు. స్వయంగా పీసీసీ చీఫ్ పర్యటల్ని కూడా కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వైఖరులే పార్టీ పుట్టి ముంచుతున్నాయని…
నల్గొండ జిల్లా… తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయం పీక్ స్టేజ్ కి చేరింది.ఫిర్యాదుల పర్వంతో నియోజకవర్గ రాజకీయాలు హీటెక్కాయి.కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, దామోదర రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి గత ఎన్నికల్లో తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కి వ్యతిరేకంగా పని చేసిన డాక్టర్ రవి ని తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే అద్దంకి… 2018 ఎన్నికల్లో టియ్యారెస్ కు అనుకూలంగా పని చేసిన రవి ని ఎలా తీసుకు వస్తారనీ.. రాహుల్ గాంధీకి..సోనియా గాంధీకి ఫిర్యాదు…