నల్గొండ జిల్లా… తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయం పీక్ స్టేజ్ కి చేరింది.ఫిర్యాదుల పర్వంతో నియోజకవర్గ రాజకీయాలు హీటెక్కాయి.కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్, దామోదర రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి గత ఎన్నికల్లో
తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ కి వ్యతిరేకంగా పని చేసిన డాక్టర్ రవి ని తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే అద్దంకి… 2018 ఎన్నికల్లో టియ్యారెస్ కు అనుకూలంగా పని చేసిన రవి ని ఎలా తీసుకు వస్తారనీ..
రాహుల్ గాంధీకి..సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు.తుంగతుర్తి లో పార్టీ కి నష్టం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారని నేరుగా అధిష్టానం కి అద్దంకి ఫిర్యాదు చేశారు.
సీనియర్స్ మీద అద్దంకి ఫిర్యాదు చేయడం పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.అద్దంకి అన్యాయం చేసే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు.మాజీ చీఫ్ ఉత్తమ్ లైట్ తీసుకున్నారు.అయితే మాజీ మంత్రి దామోదరరెడ్డి మాత్రం వ్యవహారం కొంత సీరియస్ గా తీసుకున్నారటదామోదర రెడ్డి..తుంగతుర్తి లోని తన వర్గం నాయకులతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ తో భేటీ అయ్యారు.అద్దంకి దయాకర్ నియోజక వర్గానికి ఎన్నికల సమయంలోనే వస్తారని..
కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదని టాగూర్ కి ఫిర్యాదు చేశారటరెండు సార్లు ఓడిపోయి….పార్టీ ఆక్టివిటీ లేకుండా చేసిపార్టీకి నష్టం చేస్తున్నారని అద్దంకి దయాకర్ పై దామోదర రెడ్డి వర్గం ఫిర్యాదు చేసింది.
తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ గా మారకముందు ఇక్కడ నుండి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు.
ఎస్సీ నియోజకవర్గంగా మారిన తర్వాత ఆయన సూర్యాపేటకు షిప్ట్ అయ్యారు.అయితే, సూర్యాపేట నుండి పోటీ చేస్తున్నా, దామోదర్ రెడ్డి తుంగతుర్తిపై పట్టు కోల్పోకుండా ఎత్తులు వేస్తున్నారనే టాక్ ఉందట.ఇందులో భాగంగానే ఆయన అనుచరుడు డాక్టర్ రవిని 2018లోనే రంగంలోకి దింపినా, పార్టీ అధిష్టానం అద్దంకి దయాకర్ కి బీ ఫామ్ ఇచ్చింది.
ఇప్పుడ కూడా మళ్లీ ఆలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయనేది దయాకర్ వాదన..
తుంగతుర్తి నియోజక వర్గ పంచాయితీ ఇప్పుడు చినికి చినికి గాలి వానలా మారింది.అద్దంకి దయాకర్ రాహుల్ కి, దామోదర్ రెడ్డి ఠాగోర్ కి ఫిర్యాదు చేసుకున్నారు.మూడేళ్లుగా ఈ పంచాయతీ నడుస్తున్నా.. అధిష్టానం తీర్చకపోవటంతో ఇప్పుడు మరింత రచ్చగా మారింది.
Watch Here : https://youtu.be/nF6tBVi1VKg