విశేషమైన ప్రజాదరణ ఉన్న నటులు విషాదాంత కథాచిత్రాల్లో నటిస్తే, అవి జనాన్ని అంతగా ఆకట్టుకోలేవని అంటారు. అలాంటి ఉదాహరణలు చిత్రసీమలో కోకొల్లలు. కానీ, కొన్నిసార్లు కథ కట్టిపడేసినప్పుడు హీరో చివరలో చనిపోయినా, సదరు చిత్రాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరించిన దాఖలాలూ ఉన్నాయి. నటరత్న యన్టీ రామారావు కెరీర్ లో ఇలాంటి రెండు పరిస్థితులూ నెలకొన్నాయి. అరవై ఏళ్ళ క్రితం యన్టీఆర్ నటించిన ‘టాక్సీ రాముడు’లో హీరో తన ప్రేయసి కాపురం నిలపడం కోసం ప్రాణాలు తెగించి పోరాడి,…