దేశంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో శ్రీ సిమెంట్ ఒకటి. అయితే ఆ కంపెనీ రూ.23,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా సోమవారం కంపెనీ షేర్లు 10 శాతం పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి దాదాపు రూ.9200 కోట్లు నష్టపోయాయి. ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేరు రూ.25 వేల స్థాయి నుంచి రూ.22 వేల స్థాయికి దిగజారింది. ప్రస్తుతం కంపెనీ షేరు రూ.23 వేల స్థాయిలో ట్రేడవుతోంది.
మీరు ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇంకా లింక్ చేసుకోలేదా? మార్చి 31వ తేదీలోపు ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేసుకోవాలి. లేకపోతే అంతే సంగతులు. గడువు సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులు రెండింటినీ తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
షావోమి భారత విభాగం భారీ మోసానికి పాల్పడింది. రూ.653 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేత ఆరోపణలతో ఆ సంస్థకు కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు జారీ చేసింది. షావోమి ఇండియాకు చెందిన ప్రాంగణాల్లో సోదాలు జరపగా దిగుమతి సుంకం ఎగవేతకు సంబంధించిన కీలక పత్రాలను డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) స్వాధీనం చేసుకుంది. దాంతో ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం తెలిపింది. Read Also: మాకు జైళ్లు కొత్తకాదు…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌కి మద్రాస్ హైకోర్టు లక్ష రూపాయల జరిమానాతో షాకిచ్చింది. విజయ్ రోల్స్ రాయిస్ గోస్ట్ అనే రూ.8 కోట్ల ఖరీదైన కారును 2012లో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారుకు దాదాపు రూ.1.6 కోట్లను పన్నుగా చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హీరో విజయ్ 2021లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, విజయ్ పిటిషన్ ను జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియమ్ తోసిపుచ్చారు.…