కన్నడ నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తాజా వివరాలను వెల్లడించింది. మంగళవారం కోర్టు విచారణ సందర్భంగా రన్యా రావు, ఆమె స్నేహితుడు తరుణ్ రాజు దుబాయ్‌కు 26 ట్రిప్పులు చేసి వారు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు ఆధారాలు ఉన్నాయని డీఆర్ఐ కోర్టుకు తెలిపింది.