అమెరికా కొత్తగా విధించిన 10 శాతం బేస్‌లైన్ సుంకాన్ని తొలగించడమే కాకుండా.. జూలై 9 నుంచి ప్రతిపాదిత 16 శాతం అదనపు సుంకాన్ని కూడా అమలు చేయకూడదని భారత్ డిమాండ్ చేసింది. అమెరికా ఈ సుంకాలను తొలగించకపోతే, అమెరికన్ వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగించే హక్కు కూడా తమకు ఉంటుందని ఈ సమావేశంలో భారత ప్రతినిధులు తెలిపారు.