కోలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్, హిందూ మున్నాని ఆర్ట్ అండ్ కల్చర్ వింగ్ తమిళనాడు ప్రెసిడెంట్ కనల్ కణ్ణన్‌ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీస్ విభాగం సోమవారం పుదుచ్చేరిలో అరెస్టు చేసింది. శ్రీరంగం ఆలయం వెలుపల పెరియార్ విగ్రహంపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది.
తమిళనాడులోని చెన్నైలో గల పోరూర్ ప్రాంతానికి సమీపంలో కారులో వెళ్తున్న మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ఆరుగురిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి నగలను కూడా నిందితులు ఎత్తుకెళ్లారని వెల్లడించారు.
మద్యం మత్తు ప్రాణాలు తీస్తుందంటే ఎవరూ వినరు. చాలా మంది మందుబాబులు అదే పనిగా మందు తాగుతూ వేరే లోకంలో ఉంటారు. అలా తమ ప్రాణాల మీదికి తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. మద్యం మత్తులో ఉడుకుతున్న సాంబారులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధురైలోని పలంగానట్టిలో చోటుచేసుకుంది.