అండమాన్‌తీరంలో అల్పపీడనం ఏర్పడడంతో తమిళనాడులో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే భారీ నుంచి అతిభారీ వర్షాలతో చెన్నై నగరం తడిసిముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల పాత భవనాలు దెబ్బతిని కూప్పకూలిపోతున్నాయి. విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. డిసెంబర్ 1వరకు మత్య్సకారులు వేటకు వెళ్లొదంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.