తమిళనాడులోని మధురై జిల్ల అలంగనల్లూరు సమీపంలోని కీలకరైలో నూతనంగా నిర్మించిన జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్మించిన స్టేడియం ఇదే కావడం గమనార్హం.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ రెహ్మాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. దీనికి కారణం అతడి కుమార్తె ఖతీజా వివాహం. గతనెలలో ఖతీజా రెహ్మాన్ ప్రముఖ ఆడియో ఇంజనీర్, బిజినెస్ మెన్ రియాస్‌దీన్ షేక్ మహమ్మద్‌ను వివాహం చేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన ఈ వెడ్డింగ్‌కు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా చెన్నైలోనే వెడ్డింగ్ రిసెప్షన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా హాజరయ్యారు. అంతేకాకుండా ప్రముఖ నటుడు…
తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన అల్లుడు శబరీశన్‌పై మాజీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్ వేసిన పరువు నష్టం కేసు విచారణపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి ప్రాంతంలో మహిళలను, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసి, వీడియోలను తీసి బెదిరించిన ఘటనల్లో జయరామన్ కు సంబంధాలు ఉన్నాయంటూ సీఎం స్టాలిన్, శబరీశన్ విమర్శించినట్టు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగించారంటూ మాజీ డిప్యూటీ…