Andhra Pradesh Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ప్రస్తుతం పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం…
Ditva Cyclone: తమిళనాడుకు దిత్వా తుఫాను ఏఫెక్ట్ గట్టిగానే తాకింది. దిత్వా ఏఫెక్ట్ కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు తుఫాను కదులుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దు కావడంతో పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో ప్రయాణికులకు సూచన చేయగా, తాజాగా ఎయిరిండియా కూడా విమాన సర్వీసుల ప్రభావంపై అడ్వైజరీ జారీ…
Tamil Nadu Rains: భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం మరోమారు అల్లాడిపోతోంది. దక్షిణ తమిళనాడులో కూరుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. తిరునెల్వెలి, టుటికోరిన్, టెంకాసి, కన్యాకుమారి జిల్లాల్లో కూరుస్తున్న కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్లు విద్యుత్ సరఫరా పూర్తిగా…