ఇప్పటికే తెలుగులో, తమిళంలో వెబ్ సిరీస్ లు చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా నెక్ట్స్ హిందీలోనూ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. నిజానికి కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ మూవీ చేసింది ఆనాటి టీనేజ్ ట్యామీ. అయితే, తరువాత సౌత్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన ఆమె బీ-టౌన్ ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడీ కట్టేశాక మళ్లీ హిందీ తెర మీదకు వెళ్లింది. అజయ్ దేవగణ్, సైఫ్ అలీఖాన్ లాంటి పెద్ద…