జూన్ 19న కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 'మహా రోజ్‌గర్ మేళా' నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందులో 100 కి పైగా కంపెనీలు యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి. ఇప్పటివరకు 20 వేలకు పైగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు జరిగాయి.
న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న జీ20 అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్‌ను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శనివారం ప్రారంభించారు.