నకిలీ డాక్టర్లపై తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి చర్యలు తీసుకుంటుంది. ఎలాంటి అర్హత లేకుండానే చాలా మంది వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో.. హైదరాబాద్లోని ఐడీపీఎల్, చింతల్, షాపూర్‌నగర్ (IDPL, Chintal, Shapurnagar) ప్రాంతాల్లో నకిలీ క్లినిక్ లపై అధికారులు సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు.