Tapsee Pannu: ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ తాప్సీ. తన సొట్ట బుగ్గలతో మొదటి సినిమాతోనే కుర్రకారును తన వలలో వేసుకుని అభిమానులుగా మార్చేసుకుంది. ఇక తెలుగులో కొన్ని సినిమాలు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ ఇక్కడ అనుకున్న విజయం దక్కక బాలీవుడ్ లో పాగా వేసింది.