Home
T20 Cricket
T20 Cricket News
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక తొలి పురుషుల టీ20 మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 2 పరుగుల తేడాతో అతికష్టం మీద విజయం సాధించింది. అయితే, వైభవ్ బరిలోకి దిగుతాడని ఆశించిన జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకీ-ఫ్లెమింగ్ నిరాశ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఆ యువ సంచలనాన్ని మైదానంలో ఆడటాన్ని… -
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
అభిషేక్ శర్మ క్రికెట్ ప్రపంచంలో ఒకే ఏడాదిలో పది సార్లు డకౌట్ అయిన తొలి అంతర్జాతీయ ఆటగాడిగా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగడంతో ఈ అనూహ్య రికార్డు అతని పేరిట నమోదైంది. కేవలం ఐదు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 30 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ బాది సంచలనం సృష్టించిన అభిషేక్ శర్మ, ఇప్పుడు అదే ఫార్మాట్లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరచడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.… -
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
Vaibhav Sooryavanshi-Sanath Jayasuriya: భారత టీమ్‌లోకి కొత్తగా వచ్చిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై శ్రీలంక మాజీ కెప్టెన్, 1996 వరల్డ్ కప్ హీరో సనత్ జయసూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న ఆటగాడని, అతనిలో భారత క్రికెట్ భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడారు. అయితే, అంతమాత్రాన అతడిని తొందరపడి వెంటనే ప్లేయింగ్ 11లోకి దించకూడదని సూచించారు. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు వైభవ్ భారత స్క్వాడ్‌లో… -
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరుమీద ఉంది. జూన్ 2024లో సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 27 బంతుల్లోనే శతకం బాది ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సాహిల్ కేవలం 41 బంతుల్లోనే 18 భారీ సిక్సర్లు, 6 ఫోర్ల సహాయంతో అజేయంగా 144 పరుగులు సాధించాడు. ఇక భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ… -
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
Abhishek Sharma: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మొన్న జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే రికార్డు శతకం (సెంచరీ) బాది విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన టీ20 సిరీస్ కేవలం మైదానంలో పరుగుల వర్షంతోనే కాకుండా, స్టేడియం బయట ఫ్యాన్స్ చేసే హంగామాతో కూడా బాగా వార్తల్లో నిలిచింది. ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన… -
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నప్పటికీ, ఇంగ్లండ్ రూపంలో తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా భారత జట్టు అగ్రస్థానాన్ని కాపాడుకోగలిగింది. ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ జట్లు రెండూ సమానంగా 269 రేటింగ్ పాయింట్లతో ఉన్నాయి. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఒకవేళ చివరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ విజయం సాధిస్తే, పాయింట్ల పరంగా స్వల్ప ఆధిక్యతను సంపాదించి నంబర్… -
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
Abhishek Sharma Joins Virat Kohli T20 Centuries List: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. గురువారం రాత్రి ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో విధ్వంసక సెంచరీతో చెలరేగిన అభిషేక్.. తన టీ20 కెరీర్లో పదో శతకాన్ని పూర్తి చేశాడు. దీంతో టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ… -
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టీ20లో భారత క్రికెట్ జట్టు సర్వాంగీణ ప్రదర్శనతో విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్ కట్టడి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్… -
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
T20 Cricket: టీ20 క్రికెట్ అనగానే మనకు గుర్తొచ్చేవి ధనాధన్ సిక్సర్లు, మెరుపు అర్ధశతకాలు, ఫోర్ల వర్షం. కానీ, ఈ ఫాస్ట్ ఫార్మాట్లో బ్యాటర్ల వీరబాదుడు మాత్రమే కాదు.. ఒక్కోసారి ఊహించని స్థాయిలో టీమ్‌కు కుప్పకూలుతుంటాయి. భారీ షాట్లతో విరుచుకుపడదామని మైదానంలోకి అడుగుపెట్టిన జట్లు, పరుగుల వేట పక్కనబెట్టి క్రీజులో నిలదొక్కుకోవడానికే అష్టకష్టాలు పడిన సందర్భాలూ ఉన్నాయి. టీ20 ఫార్మాట్ చరిత్రలో బ్యాటర్ల ఘోర వైఫల్యంతో అత్యల్ప స్కోర్లకే ఆలౌటై దారుణమైన రికార్డులను మూటగట్టుకున్న జట్ల వివరాలు… -
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
India vs Afghanistan T20 Series: భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య వచ్చే నెల నుంచి జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ క్రికెట్ ప్రపంచంలో ఒక అరుదైన ఘట్టానికి వేదిక కాబోతోంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక జట్టు (భారత్) తన సొంత గడ్డపైనే ‘అతిథి’ (గెస్ట్)గా ఆడనుండగా, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ఈ సిరీస్‌కు ఆతిథ్యమివ్వనుంది. అయితే, సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సిరీస్ మ్యాచ్‌లు ప్రారంభం కాకముందే…
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!