దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసే క్రమంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సినేషన్ కోసం వినియోగించే సిరంజీల ఎగుమతులపై మూడు నెలల పాటు పరిమితులు విధించింది. మూడు రకాల సిరంజీల ఎగుమతులపై పరిమితులు విధించింది కేంద్రం. దేశంలోని అర్హులైన అందరికి వ్యాక్సిన్ అందించే క్రమంలో సిరంజీల స్టాకును పెంచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. తక్కువ సమయంలో ఎక్కువ వ్యాక్సిన్‌లు అందించాలనే లక్ష్యంలో భాగంగానే…