synthetic antibody For snakebite toxin: దేశంలో పాము కాటుల వల్ల ప్రతీ ఏడాది వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం పాము విషాన్ని తటస్థీకరించి, ప్రాణాలను కాపాడేందుకు సాంప్రదాయ పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్న ‘యాంటీ స్నేక్ వీనమ్’ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISc) శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ మానవ యాంటీబాడీని అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు.