ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం ఇంట్లోనే ఏకంగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి.. ఆమెపై దాడికి తెగబడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ను తన అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఈమెతో పాటు రెండోసారి సంజయ్ సిగ్, ఎన్డీ గుప్తాలను నామినేట్ చేసింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)ఈ రోజు నామినేషన్లను ప్రకటించింది.
స్పైస్‌జెట్ ఫ్లైట్ ప్యాసింజర్ విమానాల్లో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్కోసారి ప్రయాణికుడు మరో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేస్తే, కొన్నిసార్లు ఇద్దరు ప్రయాణికులు పరస్పరం ఘర్షణ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన అకృత్యం తాజాగా వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కొరియా దేశానికి చెందిన బ్లాగర్‌ను ఓ యువకుడు వేధించాడు. ఒంటరిగా కనిపించిన ఆ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొరియన్ యువతిని ఫాలో అయ్యి రెచ్చిపోయాడు. కొరియన్ బ్లాగర్ తన కెమెరాలో అక్కడి ప్రదేశాలను చిత్రీకరిస్తుండగా.. ఆ యువకుడు తన దుస్తులు విప్పి, వికృతంగా నవ్వుతూ ప్రైవేట్ పార్ట్స్ బయటకు తీసి చూపించాడు. ఆ యువకుడి వెకిలి చేష్టలతో ఆ యువతి భయపడిపోయింది.
ఢిల్లీలో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మాలీవాల్‌ను ఓ వ్యక్తం మద్యం మత్తులో వేధింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.