తనకు సీఎం పదవి జాక్‌పాట్ కాదని, దానికి వెనుక ఎంతో కష్టం ఉందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎవరైనా సరే కష్టపడితే జీవితంలో పైకి వస్తారని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటికీ నుండి కుప్పంలో పసుపు జెండానే ఎగిరిందని, కుప్పం ప్రజల రుణం తీర్చుకోవడానికి ఈ స్వర్ణ కుప్పం విజన్ తీసుకొచ్చానన్నారు. 2014-19 మధ్య ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని, వైసీపీ హయాంలో 4 శాతం అభివృద్ధి తగ్గిపోయిందని సీఎం మండిపడ్డారు. 2027…
ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంపై సీఎం స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. ‘స్వర్ణ కుప్పం’ పథకం పేరిట కుప్పం రూపురేఖలు మరింతగా మార్చనున్నారు. వచ్చే ఐదేళ్ల పాటు కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘స్వర్ణ కుప్పం-విజన్ 2029’ పథకంను సీఎం ఆరంభించనున్నారు. ఆది, సోమ, మంగళవారం కుప్పంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. నేడు ద్రవిడ యూనివర్శిటీలో ‘స్వర్ణ కుప్పం-విజన్…