సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ బ్యాచ్ ఐపీఎస్‌లకు శిక్షణ పూర్తయింది. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు పూర్తయింది. పాసింగ్ అవుట్ పరేడ్‌కు బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్‌సింగ్ చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఐపీఎస్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. బెస్ట్ అర్చివర్స్, ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్‌లకు అవార్డులు, రివార్డులు అందించారు. పరేడ్ కమాండర్‌గా శిక్షణ ఐపీఎస్ అంజిత్ ఏ నాయర్ వ్యవహరించారు.…