హైదరాబాద్ నగరం నేడు ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతోందంటే అది గత మూడు దశాబ్దాల (1995-2025) నిరంతర శ్రమ ఫలితమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసిన సుజెన్ మెడికేర్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా ఇటువంటి తయారీ యూనిట్లు రావడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం క్యూర్ (Cure),…