Crime: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో దారుణం జరిగింది. ఒక యువకుడు తన భార్యను ముగ్గురు వ్యక్తులతో అసభ్యకరమైన స్థితిలో చూశానని చెప్పి, పెళ్లైన నాలుగు నెలలకే ఆమె గొంతు నులిమి హత్య చేశాడని అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, మరుసటి రోజు పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయినట్లు తెలుస్తోంది.