సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్ నుండి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సు ఎదురుగా వెళుతున్న బైక్ కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.డ్రైవర్ అప్పమత్తమై ప్రయాణికులు హుటా హుటిన కిందకు దించేశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ అకాడమీ సమీపంలో ఎమర్జెన్సీ లేన్ లో ఆగి ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టింది కారు. స్పీడ్ గా లారీని ఢీ కొట్టడంతో కారు సగం వరకు దూకుకొని వెళ్లింది.
వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పంచి పెళ్ళికూడా చేసుకున్నారు. 6నెలలు సజావుగా సాగుతున్న జీవితంలో వరకట్నం వేధింపులు ఆయువతికి తోడయ్యాయి. తరచూ వేధింపులు తాళలేక ఇటు పుట్టింటిలో ఈవిషయం చెప్పలేక. చివరకు ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుంజె పిచ్చయ్య కూతురు రమాదేవి (21), ఇదే మండలం తుమ్మలపెనపహాడ్ గ్రామానికి చెందిన వరికుప్పల విజయ్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి…