ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌పై సాధించిన విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఉగ్రవాద దాడి బాధితు కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని భావిస్తున్నా అని తెలిపాడు. బాధిత కుటుంబాలకు భారత జట్టు తరఫున సంఘీభావాన్ని తెలియజేస్తున్నామన్నాడు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు సూర్య ధన్యవాదాలు తెలిపాడు. భారతదేశానికి ఈ విజయం ఒక అద్భుతమైన రిటర్న్…