Ratha Saptami: నేడు రథ సప్తమి. అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అన్ని దేవుళ్లను దర్శించుకుంటున్నారు. సూర్య భగవానుడికి పూజలు చేస్తున్నారు. అయితే.. ఇంతకీ రథ సప్తమి విశిష్టత ఏంటి? ఎందుకు జరుపుకొంటారో ఇప్పుడు తెలుసుకుందాం.. రథ సప్తమి అనగా సూర్యుడు ఉద్భవించిన రోజు. హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. సూర్యభగవానుడు కశ్యప మహాముని కుమారుడు. తేజోవంతుడు, దేవతామూర్తి. లోకసాక్షి అయిన ఆ సూర్య భగవానుని అర్చించి…