రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు మరోసారి తన దాడితో సంచలనాన్ని సృష్టించారు. భూమి సర్వే కోసం లంచం తీసుకుంటుండగా సిరిసిల్ల మండల సర్వేయర్ వేణును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇరుకుల ప్రవీణ్ అనే వ్యక్తికి చిన్న బోనాలలో మూడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని సర్వే చేయడంలో భాగంగా సర్వేయర్ వేణు రూ.30 వేలు…