Survey on Romance: నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)-5లో తాజాగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. 2019-21 మధ్య కాలంలో నిర్వహించిన ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5లో భాగంగా మన దేశంలో తొలిసారిగా శృంగారంపై సర్వే చేశారు. రొమాన్స్‌లో కండోమ్ వాడకంపైనా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. వయసులో ఉన్న వంద మంది మహిళల్లో కేవలం 2 శాతం మందే గతేడాది రొమాన్స్‌లో పాల్గొన్నారు.