HYDRA : అమీన్‌పూర్ మున్సిపాలిటీలో సమగ్ర సర్వేకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఫిర్యాదులు అందడంతో.. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఆక్రమణలపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారు హైడ్రా అధికారులు తమ కాలనీలోని పార్కులు, రహదారులతో పాటు కొన్ని ప్లాట్లను పక్కనే ఉన్న గోల్డెన్ కీ వెంచర్స్ వాళ్లు ఆక్రమించారంటూ వెంకటరమణ కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 152, 153 లో ఉన్న వెంకటరమణ కాలనీలో హైడ్రా సర్వే చేపట్టింది.…
గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి చెందిన నగరంలో అస్సలు ఎన్ని చెరువులుండేవి.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్కతేల్చేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి హైడ్రా పని చేస్తోంది. హబ్సిగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి మంగళవారం తన అధికారుల బృందంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెళ్లారు. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే డేబబ్రత పాలిట్‌తో పాటు ఇతర అధికారులతో హైడ్రా ఉన్నతాధికారుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సర్వే ఆఫ్…