ప్రయోగాల జోలికి వెళ్లొచ్చు కానీ.. ఏళ్ల తరబడి ఒకే సినిమాకు కమిటైపోయి ఒళ్లు హూనం చేసుకుని, చేతులు కాల్చుకోరాదు. ప్రయోగాలు చేయరాదు అని సూర్యకు కంగువాతో అర్థమైనట్టే ఉంది. అందుకే ఈ సారి పంథా మార్చి.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అభిమానులతో టచ్ మిస్ కాకుండా ఉండేందుకు వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. అందులోనూ ఓన్ ఇలాకాలోస్టార్ దర్శకుల్ని పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌కు ఛాన్స్ ఇస్తున్నాడు. Also Read…