MLA Hussain: సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే హుస్సేన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే తనకు కాల్ చేశాడన్నారు. మోహదీపట్నంలో బాధిత కుటుంబాలను కలిశాన్నారు. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. అసరుద్దీన్ ఓవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు.