ప్రస్తుతం రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్.’పైనే సినీ అభిమానుల్లో చర్చ సాగుతోంది. దాదాపు 36 ఏళ్ళ తరువాత వచ్చిన అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇదే కావడంతో ఆ చర్చ మరింతగా మురిపిస్తోంది. ఈ మధ్య వచ్చిన మల్టీస్టారర్స్ లో ఓ సీనియర్ స్టార్ తో తరువాతి తరం స్టార్ హీరో నటించారు తప్ప, సమకాలికులు, సమ ఉజ్జీలయిన స్టార్స్ కలసి నటించలేదు. అది రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్.’తోనే సాధ్యమైంది. ఇందులో నవతరం అగ్రకథానాయకులైన జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్…