అమ్నేసియా పబ్ కేసు విషయమై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. బాలికపై గ్యాంగ్ రేప్ కేసును సుమోటోగా మహిళా కమిషన్ స్వీకరించింది. సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని డీజీపీకి మహిళ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కేసు రిపోర్ట్ చూసిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సునీతా లక్ష్మారెడ్డి…
ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ టీఆర్ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి.. ఇంకోవైపు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఇక్కడ వేగంగా పావులు కదుపుతున్నారు. సునీతా లక్ష్మారెడ్డి గతంలో మూడుసార్లు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2014, 2019లో టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా టీఆర్‌ఎస్ కండువా కప్పుకొన్నారు…