UPSC Aspirant Murder: తిమార్‌పూర్‌లోని గాంధీ విహార్ ప్రాంతంలో జరిగిన యూపీఎస్సీ విద్యార్థి రామ్‌కేష్ మీనా హత్య చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఆధారాలను నాశనం చేయడానికి, రామ్‌కేష్ ప్రియురాలు అమృత చౌహాన్ ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ చదువుతున్న అమృత తన చదువును ఉపయోగించి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. హత్యకు ముందు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక క్రైమ్ వెబ్ సిరీస్‌లను సైతం చూసింది. ఎన్ని చేసిన తప్పించుకోలేక పోయింది.
Shocking Murder Case: దేశ రాజధాని ఢిల్లీ తిమార్‌పూర్‌లో అక్టోబర్ 6న జరిగిన యూపీఎస్‌సీ అభ్యర్థి దారుణ హత్యకు సంబంధించిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య వెనుక ఉన్న కుట్రను ఢిల్లీ పోలీసులు తాజాగా బయటపెట్టారు. ఈ కేసులో ప్రియురాలితో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆ ప్రియురాలు ప్రియుడి గొంతు కోసి చంపి, సాక్ష్యాలను నాశనం చేసినందుకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.